This product will poison your child!

0
219

మామూలుగా పిల్లలకి తీపి అంటే చాలా ఇష్టం. కానీ ఈ తీపి పదార్థం చిన్నపిల్లలు ఎప్పుడు తినకూడదు. అదే తేనె. చినాపిల్లలు ఏదన్నా తినకపోతేనో, లేదా వాళ్ళని నవ్వించడానికో తేనె వాడుతూ ఉంటారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం ఏడాది కన్నా తక్కువ వయసు ఉన్నపిల్లలు తేనె తినకూడదు.

ఏడాది వయసు వొచ్చేవరకు వాళ్ళల్లో ఉన్న బాక్టీరియా ఎదిగి ఉండదు. అందుకని వాళ్ళకి హానికరమైన బాక్టీరియాని ఆపగలిగే శక్తి ఉండదు. పచ్చి తేనెలో ఉండే క్లోస్ట్రీడియం బొటులినమ్(Clostrodium Botulinum)  చాలా విషంతో కూడుకున్నది. ఇది వాళ్ళకి ఇన్ఫాంట్ బొటులిసమ్(Infant Botulism) అనే ఒక రకమైన జ్వరాన్ని వొచ్చేలా చేస్తుంది. 1998లో జరిగిన పరిశోధనల ప్రకారం 25% తేనె పదార్థాలలో ఈ బాక్టీరియా ఉంటుంది.

ఇన్ఫాంట్ బొటులిసమ్(Infant Botulism) సూచనలు కంగారూ పెట్టెల ఉంటాయి. కండలనీ బలహీనంగా చేస్తాయి. చేతులని, కాళ్ళని కదలనివ్వకుండా చేసి, ఊపిరి తీసుకుని వ్యవస్థని ఆగిపోయేలా చేస్తాయి. దీని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. అంతే కాకుండా అత్యవసర పరిస్థితులలో దీనికి చికిత్స ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. కొన్ని మందులు ఇవ్వగానే వెంటనే కోరుకుంటారు. తరువాత చికిత్సకన్నా ముందు జాగ్రత్త మేలు కాబట్టి ఆ ఒక్క ఏడాది తేనె ఇవ్వడం ఆపితే సరి.

సర్వేజనా సుఖినోభవంతు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here